షార్ట్ సర్క్యూట్‌తో లారీ దగ్ధం

2220చూసినవారు
అనంతపురం జిల్లా కూడేరు మండలం బ్రాహ్మణపల్లి వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఓ లారీ పూర్తిగా దగ్ధమైంది. బళ్లారి నుంచి ఆష్ పౌడర్ లోడుతో అనంతపురం వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా లారీలో మంటలు చెలరేగడంతో డ్రైవర్ వెంటనే గమనించి కిందకు దిగాడు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. కూడేరు పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్