కోడి పందేలు నిర్వహించడం, పాల్గొనడం చట్టరీత్యా నేరమని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. అదివారం బెళుగుప్ప మండలం అంకంపల్లిలో సంబంధిత పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కోడి పందేలు నిర్వహించడం, అందులో పాల్గొనడం రెండూ నేరమేనన్నారు. ఆలా చేస్తే శిక్షార్హులు అవుతారన్నారు. ప్రజలు ఎవరూ వాటి జోలికి వెళ్లకూడదని సూచించారు.