ఉరవకొండ: పశువులను రోడ్లపై వదిలితే చర్యలు తప్పవు

59చూసినవారు
ఉరవకొండ: పశువులను రోడ్లపై వదిలితే చర్యలు తప్పవు
ఉరవకొండ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో పశువుల సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పంచాయతీ కార్యదర్శి గౌస్ సాహెబ్ గురువారం అధికారులతో కలిసి పట్టణంలోని ప్రధాన రోడ్లపై ప్రచారం చేశారు. బహిరంగంగా తిరుగుతున్న పశువులను యజమానులు తమ సొంత స్థలంలో వదులుకోవాలని, లేకుంటే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్