యూటీెఫ్ స్వర్ణోత్సవ ప్రచార జాత గురువారం ఉరవకొండకు చేరింది. అనంతరం యూటీెఫ్ ప్రాంతీయ కార్యాలయం వద్ద రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దేవేంద్రమ్మ యూటీఎఫ్ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరప్ప మాట్లాడుతూ యూటీఎఫ్ ఆవిర్భవించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా జనవరి 5, 6, 7, 8 తేదీలలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నందు స్వర్ణోత్సవ మహాసభలు జరుగుతున్నాయని వాటిని జయప్రదం చేయాలని తెలియజేశారు.