భవానీల తిరువీధి మహోత్సవం భక్తిశ్రద్ధలతో భక్తులు ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి ఆముదాలవలస భవానీల గురుస్వామిలు తంబి, వెంకట్రావుల ఆధ్వర్యంలో పారిశ్రామిక వాడలోని కనకదుర్గ అమ్మవారి ఆలయం నుండి భవాని మాలదారులు పట్టణంలో తిరువీధి నిర్వహించారు. పరిసర ప్రాంతాల భవాని మాలదారులు తిరువీది మహోత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.