భక్తిశ్రద్ధలతో వాడవాడలా ఉన్న దేవాలయాల్లో ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార పూజలు భక్తులు ఘనంగా నిర్వహించారు. ఆముదాలవలస నియోజకవర్గ పరిధిలో ఉన్న పొందూరు, బూర్జ, సరుబుజ్జిలి, ఆముదాలవలస గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న రామాలయాల్లో, వెంకటేశ్వర, లక్ష్మీనారాయణ, సత్యనారాయణ స్వామి దేవాలయాల్లో ముక్కోటి వైకుంఠ ఏకాదశి పూజలు ఘనంగా భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.