అక్రమంగా తరలిస్తున్న పశువులను అడ్డుకొని విశ్వహిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. శుక్రవారం కొత్తూరు నుండి 35 పశువులను చింతాడ సంతకు తరలిస్తుండగా ఆముదాలవలస మునిసిపాలిటీ పరిధిలోని పార్వతీశం పేట వద్ద విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కే. వెంకటేష్ తెలిపారు.