విజయవాడ వరద బాధితులకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని సైకత శిల్పం ద్వారా గేదెల హరికృష్ణ వివరించారు. ప్రకృతి చూపిన విలయతాండవంలో విజయవాడ అతలాకుతలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక తిన్నెల ద్వారా విజయవాడ వరదల ఘట్టాన్ని కళ్ళకు కట్టేలా సైకత శిల్పాన్ని రూపొందించారు. వరద బాధితులకు అపన్న హస్తం అందివ్వాలని సమాజానికి సైకత శిల్పం ద్వారా సమాచారం అందించారు.