నవంబర్ 29న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆముదాలవలస నియోజకవర్గ టిడిపి కార్యాలయం బుధవారం తెలిపారు. టిడిపి కార్యాలయం నుండి వెలువడిన ప్రకటనలో ఐదు బహుళ జాతి కంపెనీలకు చెందిన సంస్థలు నిరుద్యోగ యువతకు జాబ్ మేళా నిర్వహిస్తుందని, 10వ తరగతి నుండి పీజీ వరకు ఏదైనా విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువత అర్హులని సూచించారు.