ఆమదాలవలస మండలం శైలాడ గ్రామ సచివాలయాంలో నియోజకవర్గం ఎమ్మెల్యే కూన రవికుమార్ బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సకాలంలో సచివాలయ సిబ్బంది విధులకు హాజరు కాకపోవడం పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది ఆలస్యానికి గల కారణం ఏమిటని ఆరా తీశారు. కొందరు సచివాలయం సిబ్బంది పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.