ఆముదాలవలస మండలంలోని ఉపాధి హామీ పథకం ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయం వద్ద బుధవారం ఉపాధి హామీ పథకంలో జరిగిన పనులు పై సామాజిక తనిఖీ సమీక్ష సమావేశం నిర్వహించారు.గత ఆర్థిక సంవత్సరం నిర్వహించిన పనులను, ఇప్పుడు చేపట్టాల్సిన పనులను ప్రకటించారు.ఈ సమావేశంలో డ్వామా ఎఫ్ఎం స్వరూప రాణి ,డి వి ఓ లోకేశ్వరరావు , ఎంపీపీ ప్రతినిధి తమ్మినేని శ్రీరామ్ మూర్తి లతోపాటు వేతనదారులు,క్షేత్రస్థాయి పరిశీలకులు పాల్గొన్నారు.