అవగాహనతోనే వివిధ రకాల అంటు రోగాల వ్యాప్తిని నివారించవచ్చని వైద్యాధికారి డాక్టర్ పావని అన్నారు. ఈ మేరకు గురువారం ఆమె మాట్లాడుతూ బూర్జ మండలంలో సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన పెంచుకోవాలని స్థానికులకు సూచించారు. వ్యర్థ నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తపడి దోమల నివారణ చేయాలని కోరారు. బహిరంగ మలమూత్ర విసర్జన చేయకూడదని అన్నారు. మరిగించి చల్లార్చిన నీటిని త్రాగాలని కోరారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు