సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

82చూసినవారు
సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే
ఆముదాలవలస మున్సిపాలిటీలోని 15వ వార్డు మోనింగ్ వారి వీధి సచివాలయంలో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయం సిబ్బంది యొక్క రిజిస్టర్ పరిశీలించారు. సకాలంలో సచివాలయ సిబ్బంది విధులకు హాజరు కాకపోవడం పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది ఆలస్యానికి గల కారణం ఏంటని ఆరా తీశారు. దీని పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్