ఎచ్చెర్ల మండలం పరిదుపేట గ్రామానికి చెందిన మొదలవలస చిన్నారావు అనే ఆర్మీ జవాన్ ఈనెల 13న రాజస్థాన్ రాష్ట్రం బికనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి శనివారం తీసుకువచ్చారు. అనంతరం అధికార లాంఛనాలతో అంత్యక్రియ నిర్వహించారు. జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ర్యాలీ నిర్వహించింది. ఆర్ముడ్ రిజర్వు పోలీసులు గాడ్ ఆఫ్ హానర్ ఘటించారు.