ఎస్సీ ఎస్టీలకు చట్టాలపై పూర్తి అవగాహన అవసరంగా విశాఖపట్నం సిఐడి విభాగం అడిషనల్ ఎస్పీ జి. ప్రేమ కాజాల్ అన్నారు. ఎచ్చెర్ల మండల కేంద్రంలోని స్థానిక చిలకపాలెంలోని శ్రీ శివాని ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీల చట్టాలు, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యాయశాఖ అధికారులు, న్యాయవాదులు, పోలీసులు మాట్లాడారు.