ఆసుపత్రికి వెళ్లి పింఛన్ అందజేసిన సెక్రటరీ

67చూసినవారు
ఆసుపత్రికి వెళ్లి పింఛన్ అందజేసిన సెక్రటరీ
ఎచ్చెర్ల మండలం ఎస్. ఎం. పురం గ్రామానికి చెందిన గురుగుబెల్లి చిన్నమ్మాయి అనే వృద్ధురాలు ఇటీవల కుక్కకాటుకు గురై శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సెక్రటరీ దానేటి లోకనాధం శుక్రవారం ఉదయం శ్రీకాకుళం వెళ్లి చికిత్స పొందుతున్న ఆ వృద్దురాలికి పింఛను అందజేశారు. ఆసుపత్రికి వెళ్లి మరి పింఛను అందించడంతో ఆ వృద్ధురాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్