ఇచ్ఛాపురం: అక్రమంగా తరలిస్తున్న 21 వన్యప్రాణుల పట్టివేత

72చూసినవారు
కారులో అక్రమంగా తరలిస్తున్న 21 వన్యప్రాణులను అటవీశాఖ అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఇచ్ఛాపురం చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తున్న రేంజర్ మురళీకృష్ణ నాయుడు పట్టుకున్నారు. పట్టుబడిన వాటిలో కొండచిలువ పిల్లలు, తాబేళ్ళు, అడవి పిల్లులు ఉన్నాయి. వీటిని ఒడిశా నుంచి కారులో కర్ణాటక తరలిస్తున్నట్లు గుర్తించారు. వీటిని విశాఖ జూకి తరలించారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్