జలుమూరు మండలంలోని శ్రీముఖలింగంలో ఉన్న శ్రీముఖలింగేశ్వర ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. శనివారం ఉదయం నుంచి పలు ప్రాంతాల నుంచి పలువురు భక్తులు ఆలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున క్యూ లైన్లో స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. స్వామి దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు ఈవో ప్రభాకర్ రావు తెలిపారు. మూడవ సోమవారం మరింత రద్దీ ఉండే అవకాశం ఉందన్నారు.