మందస మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే కంచిలికి చెందిన బి ధనుంజయ మందసకు బైక్పై వెళ్తున్నారు. ఈ క్రమంలో బాలిగాం బ్రిడ్జ్ సర్వీస్ రోడ్డు. వద్ద వాహనం అదుపు తప్పింది. దీంతో కింద పడిన ఆయనకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 1033 నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం క్షతగాత్రుడుని హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.