పలాస సూది కొండ సమీపంలో నాగుల చవితి పర్వదినాన రెండు సర్పాల సయ్యాట అందరి దృష్టిని ఆకర్షించింది. మంగళవారం నాగుల చవితి సందర్భంగా అటుగా వెళ్తున్న స్థానికులకు రెండు పాములు సయ్యాటలాడుతూ కనిపించాయి. సుమారు గంట సమయం ఆ రెండు సర్పాలు సయ్యాటలాడుతూ సమీప పొదల్లోకి వెళ్లిపోయాయి. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు తమకు ఎంతో అదృష్టం కలిగిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.