ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత

72చూసినవారు
ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత
ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. మంగళవారం పాతపట్నం మండలంలోని కాగువాడ గ్రామంలో ఎన్టిఆర్ భరోసా పించన్ సొమ్ము లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ సచివాలయం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్