రాజాం నియోజకవర్గం, రేగడి మండలం సంకిలి ఇఐడి ప్యారి షుగర్స్ చెరకు క్రషింగ్ ఈనెల 16తో ముగుస్తుందని సంస్థ సీనియర్ ఏవిపి పట్టాభిరామ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం సంకిలి ఇఐడి ప్యారి షుగర్స్ సమావేశ ఛాంబర్లో స్థానిక విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రషింగ్ చెరుకు సరఫరా చేయని రైతులు ఇంకా మిగిలి ఉంటే డివిజన్ స్థాయిలో సిడిఓలు, నేరుగా కటింగ్ ఆర్డర్లకు వస్తే చేస్తామని తెలిపారు.