విజయవాడ వరద బాధితులు సహాయార్థం సీఎం సహాయనిధికి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు తన ఒక్కనెల వేతనాన్ని విరాళంగా ప్రకటించినట్లు మంగళవారం కూటమి నాయకులతో కలిసి వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని నాయకులు తమ వంతు సాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించాలని ఎమ్మెల్యే కోరారు. ఏర్పాటు కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.