ప్రజలు ఎన్నికల ఫలితాల అనంతరం సంయమనం పాటించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అన్నారు. శ్రీకాకుళంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కలెక్టర్ తో కలిసి జిల్లా ఎస్పీ మాట్లాడారు. జిల్లాలో 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎక్కడ కూడా నలుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండరాదని హేచ్చరించారు.