విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి-ఎమ్మెల్యే

51చూసినవారు
విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి-ఎమ్మెల్యే
విద్యార్థుల్లో ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని దానిని సాధించే దిశగా ప్రయత్నం చేస్తూ విద్యపైనే దృష్టి సారించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల జూనియర్ కళాశాలలో పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే గురువారం ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, విద్యతోనే సమాజ అభివృద్ధి అని తెలిపారు.

సంబంధిత పోస్ట్