ఎస్సీల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఎస్సీ ఆది ఆంధ్ర జిల్లా కన్వీనర్, అడ్వకేట్ వై. చలపతిరావు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఉప కులాల్లో వెనుకు బాటు తనాన్ని మెరుగు పరిచేందుకు ప్రభుత్వాలు సదుపాయాలు కల్పించాలన్నారు. ఎస్సీ కులంలో బాగా వెనుకబడిన ఈ సెక్షన్ల అభ్యున్నతకు తగు చర్యలు చేపట్టి, నిర్మూలించినందుకు క్రిమిలేయర్ పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు.