ఆముదాలవలస మండలం చీమలవలస గ్రామానికి చెందిన సనపల అన్నపూర్ణమ్మ(99) సోమవారం హఠాన్మరణం చెందారని స్థానిక గ్రామస్తులు తెలిపారు. అన్నపూర్ణమ్మ కు 99 సంవత్సరాల వయస్సు అయినప్పటికీ ఎటువంటి అనారోగ్యం లేకుండా జీవించారని అన్నారు. ఈమె భర్త గోపాలరావు 2015 లో మరణించారని అన్నారు. ఈమెకు 10మంది కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారని తెలిపారు. ఈమె కుమారుల్లో ఒకరు సనపల చెల్లన్నాయుడు ప్రస్తుతం చీమలవలస సర్పంచ్ గా కొనసాగుతున్నారు.