బూర్జ మండలం కురుంపేట గ్రామంలో చట్టపరమైన అంశాలపై సోమవారం సాయంత్రం అవగాహన కార్యక్రమం నిర్వహించారు స్థానిక ఎస్ఐ ప్రవళిక. సైబర్ నేరాలు, మహిళల భద్రతపై అవగాహన కల్పించారు. అనధికార చిట్టీలు, ఆర్థిక నేరాలు, గంజాయి, నిషేధిత మత్తు పదార్థాల రవాణా చట్టరీత్యా నేరం అని వివరించారు. చట్ట వ్యతిరేక చర్యలపై ఏదైనా సమాచారం ఉంటే పోలీస్ స్టేషన్ లో తెలియపరచాలని కోరారు.