ఆమదాలవలస: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

72చూసినవారు
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. సోమవారం ఆమదాలవలస మండలం తొగరాం గ్రామంలో ఉపాధి హామీ నిధులతో మంజూరు చేసిన రు. 1 కోటి 39 లక్షలతో నిర్మాణం చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వంలో పంచాయితీలను అభివృద్ధి చేపట్టడంలో వైఫల్యం చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్