ఆమదాలవలస మండలం కొత్తవలస గ్రామానికి చెందిన జి. లచ్చన్న (18) ఆదివారం మృతి చెందాడు. మృతుడు డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులు మందలించారని మనస్థాపానికి గురై, గడ్డి మందు తాగి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గుర్తించి అతన్ని శ్రీకాకుళం రిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.