ఆమదాలవలస మున్సిపల్ కమిషనర్ పి. బాలాజీ ప్రసాద్ బుధవారం సాయంత్రం కృష్ణాపురం పరిధిలోని మోనంగివారివీధి 1, 2 సచివాలయలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ మేరకు సచివాలయంలో కార్యదర్శుల హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రతిష్ఠాత్మకమైన సర్వేలు ఎన్పిసిఐ అకౌంట్లో యాక్టివేట్ చేయటం, అపార్, ఆధార్ డేటా సవరించుట సకాలంలో పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.