బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో అనేక ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని విజయనగరం జిల్లా
బీజేపీ అధ్యక్షులు నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు రణస్థలం మండలంలో నీటమునిగిన పంట పొలాలను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నష్టపోయిన రైతులందరిని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.