‘నాకు ‘కృష్ణం వందే జగద్గురుం’తో దేవుడు అంటే ఎవరో సాయి మాధవ్ బుర్ర చూపించారు. అందులోని ‘దేవుడంటే సాయం’ ఈ పదం నాకెంతో ఇష్టం. ఆ ఒక్క పదం నా జీవితాన్ని మార్చేసింది’ అని నటుడు రానా అన్నారు. ఇవాళ ‘దేవకీ నందన వాసుదేవ’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. ‘ఆరోజు నుంచి సాయం కావాలని ఎవరు అడిగినా చేస్తాను. నేను, మహేశ్ 20 ఏళ్ల నుంచి స్నేహితులం. అశోక్‌కు ఈ సినిమా బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని రానా అన్నారు.