రణస్థలం మండలం పైడిభీమవరం ప్రాంతంలో ఓ పాతికేళ్ల కిందట పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారని తెలిసి స్థానికులు సంబరపడిపోయారు. తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని భావించారు. తీరా ఉపాధి లేకపోగా.. ఇప్పుడు అవే పరిశ్రమలు కాలుష్యంతో తమ ఆయుష్షును తీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.