రోడ్డు ప్రమాదంలో వీఆర్వో మృతి

11289చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వీఆర్వో మృతి
జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బుధవారం వీఆర్వో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తోటపాలేం పంచాయతీకి వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న బలివాడ ధనుంజయ రావు తన బైక్ పై వెళ్తుండగా.. చిలకపాలెం వంతెన సమీపంలో లారీ ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని సొంత గ్రామం లక్ష్మీపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయనకు భార్య శైలజా, ఇద్దరు కుమారులు ఉన్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు. వీఆర్వో మృతి పట్ల రెవెన్యూ శాఖ అధికారులు సంతాప వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్