ప్రపంచ శాంతి, పర్యావరణ పరిరక్షణ కోసం సైకిల్ యాత్ర చేస్తున్న ముత్తు సెల్వన్ ను విజయనగరం పార్లమెంట్ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభినందించారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ నుంచి ముత్తు సెల్వన్ సైకిల్ యాత్రలో భాగంగా శనివారం రాత్రి రణస్థలం కు చేరుకున్నారు. 2021 డిసెంబర్ 28న తన ప్రయాణం కోయంబత్తూర్ నుంచి ప్రారంభించినట్లు ముత్తు సెల్వన్ వివరించారు. 2025 లో ఈ యాత్ర ముగుస్తుందన్నారు.