ఘోర రోడ్డు ప్రమాదంలో తృటిలో తప్పిన ప్రాణాపాయం

5046చూసినవారు
ఇచ్చాపురం సమీపంలో (పేటూరు ఒడిస్సా) జాతీయ రహదారిపై మైలురాయి 480/150 వద్ద అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిస్సా విశాఖపట్నం ఐరన్ మట్టిలోడుతో వెళ్తున్న లారీని మరో లారీ వెనుక నుంచి బలంగా ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డుపై అడ్డంగా ఓ లారీ పడ్డంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి, ఇంకో లారీ వంతెన పై సగభాగం వేలాడుతూ ఉంది. ఇరు లారీ సిబ్బంది గాయాలుతో బయట పడ్డారు, హైవే(1033) ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తున్నారు. ఒడిస్సా జరడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్