
పాలవలస: తప్పిన రోడ్డు ప్రమాదం..
సోంపేట మండలం పాలవలస గ్రామ సమీప జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున లగేజీ వ్యాన్ అదుపుతప్పి పొలంలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. రాజమండ్రి నుంచి అరటి గెలల లోడుతో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వాహనాన్ని బయటకు తీయించారు.