కంచిలి మండలంలోని నువాగడ కాలనీలో చేపడుతున్న గిరిజన భవన నిర్మాణాన్ని అడ్డుకోవడం దారుణమని ఆదివాసీ గిరిజన సంఘ జిల్లా నాయకులు సవర దర్మారావు, రుషిభయ్యా అన్నారు. శనివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ అన్యాక్రాంతమైన భూములలో తుప్పలు, డొంకలు తొలగించి ప్రభుత్వం మంజూరు చేసిన మల్టీ పర్పస్ భనన నిర్మాణానికి భూమిచదును చేశామని, ఆ భూమి తనదంటూ అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి అభ్యంతరం చెప్పడం దారుణమన్నారు.