ఇచ్ఛాపురం: వివాహిత అదృశ్యం

68చూసినవారు
ఇచ్ఛాపురం: వివాహిత అదృశ్యం
ఇచ్ఛాపురం పట్టణంలోని అప్పన్నపేటకు చెందిన కీర్తి అనే వివాహిత అదృశ్యమైనట్లు ఎస్ఐ చిన్నంనాయడు శనివారం తెలిపారు. కీర్తి, నీలపు హరిప్రసాద్ కు 2017లో వివాహమైందన్నారు. ఆమె భర్త బతుకుతెరువు నిమిత్తం కలకత్తాలో ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటున్నారని అన్నారు. ఈ నెల 19న ఆమె అదృశ్యం అయ్యిందని, బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభించలేదన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్