ఆకట్టుకున్నపెసర గణపతి
కవిటి మండలంలోని బొరివంక గ్రామంలో గల ఉద్దానం యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఈ ఏడాది పెసర విత్తనాలు వేసి నారుతో తయారుచేసిన విగ్రహాన్ని క్లబ్బుకు చెందిన ప్రముఖ శిల్పి బైరి తిరుపతి తయారు చేశారు. పర్యావరణానికి హాని కలగని గణపయ్యలను తయారు చేయడమే ఈయన ప్రత్యేకత.