రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ మాజీ పిఏ మురళి పై ఏసీబీ దాడులు పట్ల ఆయన స్పందించారు. గురువారం ఆయన నరసన్నపేటలో మాట్లాడుతూ తప్పు ఎవరు చేసిన శిక్ష అనుభవించాల్సిందే పేర్కొన్నారు. ఆనాడు అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడుపై కూడా కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. ఎవరు తప్పు చేసినా చట్టం ముందు అంత ఒకటేనని, శిక్ష అనుభవించాల్సిందే ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.