జిల్లా ఎస్పీ కె. వి. మహేశ్వర రెడ్డి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం స్పందనలో మందసాకు చెందిన మావోయిస్టు కేశవరావు సమస్యను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు గతంలో స్వచ్చందంగా ఆయన లొంగిపోయారు. ఆయన లొంగుబాటు అనంతరం ఒడిశా పోలీసులు విచారణకు తీసుకెళ్తున్నామని చెప్పి నేటి వరకు తిరిగి పంపించలేదని సమస్యను పరిష్కరించాలని ఎస్పీని కోరారు.