శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీ గురుకుల విద్యాలయం కళాశాలలో ప్రముఖ గాంధేయవాది, కళాశాల ఫౌండర్ శ్రీ కింతలి కృష్ణమూర్తి మాస్టర్ విద్యార్థులకు, అధ్యాపక, అద్యాపకేతర సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలందరూ పండుగను ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకోవా లని ఆయన ఈ సంద్భంగా కోరుకున్నారు. ఈ ఉగాది తెలుగు వారందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలందరికీ మహమ్మారి రహిత ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు. కరోనా మహమ్మారిని అత్యంత ధైర్య సాహసాలతో ఎదుర్కొని విజయం సాధించిన మనం చదువులో కూడా రాణించాలని విద్యార్ధుల కు సూచించారు. ఈ నూతన సంవత్సరంలో అందరూ ప్రభుత్వ సూచనలను పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని మాస్టారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపల్ శిష్టు నరేంద్రనాధ్, కంచారాన మోహన్ బాబు, గంగాధర్, సింహాచలం, కోదండరావు, తిరుపతిరావు, కిల్లి శ్రీను, రాజేష్, లక్మణ్, కార్తీక్, బట్టి రాజు, పల్లవన్, రమణ తదితరులు పాల్గొన్నారు.