పలాస: విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోస్టల్ కార్డు ఉద్యమం
విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ ప్రతిపాదనను కేంద్రం వెనక్కి తీసుకోవాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోస్ట్ కార్డు ఉద్యమాన్ని సోమవారం పలాసలో ఉత్తరాంధ్ర ప్రజాసంస్థ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. విశాఖ ప్లాంట్‌కు పదివేల కోట్లు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఉత్తరాంధ్ర ప్రజలకు కేంద్రం మోసం చేస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.