సీఎం సహాయనిధికి రూ.10 లక్షల చెక్కు అందజేత

77చూసినవారు
సీఎం సహాయనిధికి రూ.10 లక్షల చెక్కు అందజేత
విజయవాడ వరద బాధితుల సహాయార్ధం సీఎం సహాయనిధికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసారు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు. సోమవారం విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడుకి ఆర్థిక సహాయం చెక్కును ఎమ్మెల్యే అందజేసారు. మానవతా దృక్పథంతో బాధితులకు ఆర్థిక సహాయం అందించడం పట్ల ఎమ్మెల్యే  గోవిందరావును సీఎం అభినందించారు.