పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు కాళోజీ. తన కవితల ద్వారా పేదలు, తెలంగాణ ప్రజల ఆవేదన, ఆగ్రహాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ఆయన రాసిన ‘నా గొడవ’ సంకలనంలో సమకాలీన సామాజిక సమస్యలను ఏకరువు పెట్టారు. కాళోజీ సేవలకు గుర్తింపుగా కాకతీయ వర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా.. భారత ప్రభుత్వం పద్మ విభూషణ్‌తో సత్కరించింది. తెలంగాణ ప్రభుత్వం వైద్యవిశ్వవిద్యాలయానికి కాళోజీ హెల్త్ సైన్సెస్ యూనివర్శిటీ అని పేరు పెట్టింది.