నివగాం: పూర్వ విధ్యార్థుల ఆత్మీయ కలయిక
20 సంవత్సరాల తరువాత స్నేహితులు ఆత్మీయ కలయిక నిర్వహించుకొని తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించుకున్నారు. కొత్తూరు మండలం నివగాం గ్రామ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల లో 2004 - 2005 సంవత్సరంలో కలిసి చదువుకున్న పూర్వపు విద్యార్థులు ఆదివారం ఒకే చోట కలుసుకున్నారు. ప్రతి సంవత్సరం జనవరి 17న పాఠశాల అభివృద్ధికి పలు సేవా కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం పండుగలా నిర్వహించారు.