గత ఐదారు రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురిసిననేపధ్యంలో శుక్రవారం వాతావరణం సాధారణ స్థితికి చేరుకోవడంతో మండలంలో రైతులు పొలాల్లో వరినాట్లు ప్రారంభించారు. పంటపొలాల్లో మహిళలు శ్రీకాకుళం జానపదాలను ఆలపిస్తూ. నాట్లువేసే దృశ్యం మెళియాపుట్టి మండల కేంద్రంలో కనిపించింది. ఇదిలా ఉండగా కూలీల కొరత కూడా ఎక్కువగా ఉందని రైతులు చెబుతున్నారు. కూలీ ఇవ్వాలన్నా. ఆర్థికపరంగా కొంత మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు.