అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడి సిబ్బంది ఎమ్మెల్యే మామిడి. గోవిందరావు ను కోరారు. ఈ మేరకు బుధవారం లక్ష్మీనర్సుపేట మండలం రావిచంద్రిలో ఎమ్మెల్యే కు వినతిపత్రo అందజేశారు. ఈసందర్బంగా యూనియన్ నాయకులు కె. వి. హేమలత. కె. లక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీలకు ఇచ్చిన హామీలకు జి. ఓ. లు విడుదల చేయాలన్నారు. కొత్తూరు ప్రోజెక్ట్ పరిదిలో ఇటీవల మరణించిన అంగన్వాడీ కుటుంబాలుకు ఆర్థిక సహాయం అందజేయాలన్నారు.